Pages

Tuesday, November 23, 2010

హిందూ ధర్మానికి మతంతో సంబంధం లేదు

సామాన్యంగా పాశ్చాత్య దృక్పథంలో మత ప్రమేయం లేని ధర్మం అన్నది మతానికి సాక్షాతు విరుద్దమైనది. మతమంటే వారి దృష్టిలో ఒక ప్రవక్త తన అనుచరుల మీద శాసించే విశ్వాసాల పుట్ట. ప్రతి మతమూ కొన్ని విశ్వాసాలను ఆ మతస్థులకు నిర్దేశిస్తుంది. అవి ఎందుకు? అన్న తర్కం లేకుండా వారు వాటిని పాటించాలి. అలా పాటించిన వారికి మోక్షం లభిస్తుందని, లేని వారికి శాశ్విత నరకం ప్రాప్తిస్తుందని ఆ మతస్థులు గాఢంగా నమ్ముతారు. ఆ మతస్థులు నయానో, భయానో ఇతర పలు మార్గాల ద్వారానో ప్రజా బాహుళ్యాన్ని తమ మతంలో విలీనం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. మతాన్ని వ్యాపింప చేయడమే వారి లక్ష్యం. తమ మతంలో చేరని వారంతా పతితులని, వారందరిని ఉద్దరించటమే తమ ధ్యేయమని వారు చెప్తుంటారు. వారు పునర్జన్మ సిద్దాంతాన్ని నమ్మరు. మానవుడు ఈ లోకంలో చేసిన పాపాలు ఒక క్షమాపనతో సరి అంటారు. హిందూ ధర్మం అటువంటిది కాదు. పునర్జన్మ సిద్ధాంతం విశ్వసించబడుతుంది. పాపాలు చేసిన వారు శిక్ష అనుభవిస్తారని, పుణ్యాలు, ధర్మాలు చేసినవారు పుణ్యం మూటగట్టుకుంటారని హిందు ధర్మం చెబుతోంది. దీనిలో జనులు మంచి పనులు మాత్రమే చేసే మంచి జీవన విధానం పొందుపర్చబడింది. హిందువుల దృక్పధంలో మతమంటే విశ్వాసాల పుట్ట కాదు. అది ఒక జీవిత విధానం. ఒక అనుభవ విశేషం. వాస్తవాల సమాహారం. పరమాత్మ లక్షితమైన జీవాత్మ అంతరంగం సాధించే అనుభవం అది. హిందూ ధర్మం ప్రయోగాత్మకమైన ప్రాతిపదిక కలది. ఇది మానవ ప్రకృతి ఎంత విశాలమైందో అంత విస్తారమైంది. హిందూ ధర్మం కరుడు కట్టుకొని, అంధ విశ్వాసాలతో ఆగి పోలేదు. ఇతర మతాలపై సద్భానను ప్రకటించటమే కాకుండా గౌరవ భావాన్ని చాటి చెప్పింది. అందరూ ఒకే విశ్వాసాన్ని, ఒకే ఆరాధనామార్గాన్ని అనుసరించాలని హిందూ ధర్మం ఎప్పుడూ చెప్పలేదు. మోక్షానికి ఇదే ఏకైక మార్గమని అనుసరించాలని ఒత్తిడి చేయలేదు. హిందూ ధర్మం ప్రవాహం వంటిది. నిత్య చైతన్య వంతమైనది. కాలానుగుణంగా గతిని మార్చుకున్న దాని శీలం పదిలంగా ఉంది. హిందువులు నూతన ధర్మాలను అధరించి జీవన పధంలో వాటిని పరిశోధిస్తూ వచ్చారు. సత్యాన్వేషణతో ప్రగతిశీలమైన ధర్మాలను సాంప్రదాయాలుగా ఆచరిస్తునే ఉన్నారు. కాబట్టి హిందూ ధర్మానికి మతంతో సంబంధం లేదు - బి.గోపీనాధ్‌

Wednesday, November 17, 2010

చతుర్వేదాలు

వేదం అంటే ?

వేదం అంటే విజ్ఞాన శాస్త్రం. మన చుట్టూ ఉన్న ప్రకృతి లో ఎన్నో శక్తి విశేషాలు ఉన్నాయి. మనం బ్రతకాలంటే నీరు కావాలి, గాలి కావాలి, నిప్పు కావాలి, ఇలా ఎన్నో ఉంటే తప్ప మన జీవనం గడవదు. మనం తినే ఆహారం తయారు అవ్వడానికి ఈ భూమి సహకరించాలి. మట్టి ఒక్కటి ఉంటే సరిపోదు, సూర్యరశ్మి సోకితేనే అవి పెరిగి మనకు ఆహారంగా కాగలవు. నీరు వర్ష రూపకంగా అందాలి. మనకు అనారోగ్యం చేస్తే కావల్సిన ఔషదాలు మన చుట్టూ ఉన్న ప్రకృతిలో ఉంటాయి. ప్రకృతి లోని శక్తి విశేషాల గురించి తెలిపే వాటిని ఋగ్వేదం అని అంటారు.

వేదాల్లో చాలా శాఖలు ఉన్నాయి. వాటి సంఖ్యలు 1131 శాఖలు అని చెబుతారు. స్తూలంగా వాటిని నాలుగు భాగాలుగా వేదవ్యాస భగవానుడు ఏర్పాటుచేసాడు. అంతకుముందు ఆయా లక్షణాలతో వెరే వేరే భాగాలుగా ఉండేవి. అందులో ఒక లక్షణమైన వాటిని ఋక్కులని, ఒక లక్షణం కల్గిన వాటిని మంత్రభాగం క్రింద యజస్సు అని, ఒక లక్షణం కల్గిన వాటిని గానాత్మకంగా సామం అని, మరికొన్నింటిని ఆదర్వణం అని ఇలా పేర్లతో ఆయా ఒక్కో భాగాన్ని ఒక్కో శిష్యుల ద్వారా పదిలపర్చడానికి వారికి అందించి, ఇక వారి ప్రశిష్యుల ద్వారా మరిన్ని ఉప శాఖలుగా విభజించి వాటి రక్షణ వ్యవస్త ఏర్పాటు చేసినట్టుగా మన శ్రీమన్ భాగవతాది గ్రంథాలు తెలియజేస్తున్నాయి.
మొదట ఈ నాలుగు వేద రాశులని ఒక్కో వ్యక్తి అధ్యయనం చేసే స్తితి ఉండేదేమో, కానీ వేదవ్యాసుని సమయానికే కొంత సందేహం ఏర్పడి రాన్నున్న కాలంలో ఈ మాత్రం నిలబెట్టుకొనే సామర్థ్యం మనుష్యులలో ఉండకపోవచ్చుననేమో ఆయన తన శిష్యుల ద్వారా వాటిని పరిరక్షించే వ్యవస్త ఏర్పాటు చేసి ఉంటాడు. సూర్య ఉదయం చాలా మెల్లగా ఉంటుంది, అదే సూర్య అస్తమయం చాలా వేగంగా ఉంటుంది. అలాగే మనుష్యులలో ధార్మిక ప్రవృత్తి అనేది ఎంత వేగంగా దిగజారుతుందో మనకు తెలుస్తుంది. ఆధునిక వైజ్ఞానిక ప్రవృత్తులు సమాజాన్ని ఎంత త్వరగా దిగజార్చాయి అనేది కూడా గమనించవచ్చు. ఆధునిక వైజ్ఞాన శాస్త్రం పెరిగింది 16 వ శతాబ్దం నుండే, అయితే దాని వల్ల మంచి జరిగింది కానీ ఎన్నో వేల సంవత్సరాల నుండి వస్తున్న ప్రకృతి చిన్నా భిన్నం అవడంకూడా అప్పటి నుండే మొదలైంది. అయితే వ్యవస్త చిన్నా భిన్నం అవడం ఎంత త్వరగా జరుగునో మనకు దీన్ని గమనిస్తే తెలుస్తుంది.




ఈ సృష్టి అంతా ఆ వేద శబ్దంచే సృజించబడి ఉంది.

అది విని నేర్వాల్సిందే తప్ప చదివి నేర్చేది కాదు. వేదం అనేది ఒక భాషకు కూడ అందనిది. ఎందుకంటే భాషలనేవి మనుష్యులు అవసరంకోసం ఏర్పర్చుకున్నవి. వేద శబ్దాల్లోంచి సంస్కరించబడి ఉన్న భాష సంసృతం అవడంచే ఆ భాషలో మనకు వేదం కనిపిస్తుంది. భాషలు, అక్షరాలు ఇవన్నీ ఏర్పడక ముందే శబ్దం అనేది ఉంది. వేదాలు అనేవి ఒకరు ఏర్పర్చిన శబ్దం కాదు. సహజ శబ్దాలను మనం వేదాలు అని అంటాం. ఏర్పాటుచేసుకున్న శబ్దాలని మనం భాషలు అంటాం. అయితే వేదాన్ని సహజ శబ్దం అని ఎలా అనగలం అంటే, ఆ శబ్దాలలో ఇమిడి ఉన్న ఆ విధానం అనేది మన భాషా ప్రావిణ్యానికి అందనిదిలా కనిపిస్తుంది కాబట్టి.
ఈ ప్రకృతిలో ఇంత విశ్వం తయారుకావడానికి కారణమైన వేద శబ్దాలను మన ఋషులు తపస్సమాధి దషలో వాటిని గుర్తించారు. వాటిని తమ శిష్యులకు అందించారు. అయితే ఇది శ్రవన పరంపర. ఉచ్చారణ- అణుచ్చారణ క్రమంగా వేదాధ్యయనం సాగేది. అది విని నేర్చేది కనక శృతి అని పేరుపెట్టారు.
పదే పదే ధ్యానించేది కనక ఆమ్నాయము అని అంటారు.
భగవంతునికి కూడా అది ఎప్పటిదో తెలియదు కనక దాన్ని నిత్యం అని పేరు పెట్టారు.
అయితే దాన్ని తెలుసుకుంటే మనకు ఏమడిగితే దాన్ని ఇస్తుంది, తెలిపేది మరియూ కావల్సిన లాభాన్ని ఇచ్చేది కనక వేదం అని పేరు పెట్టారు.
ఎవ్వరూ వ్రాయనిది కనక అపౌరుషేయం అని పేరు. ప్రతి ప్రాణి పురుష విభాగంలోకే చెందుతుంది, ఇక పరమాత్మ కూడా ఉత్తమ పురుషుడు, అంటే ఒక పురుష విభాగంలోకే చెందుతాడు. అందుకే అయన రాసింది కూడా కాదు వేదం.
ఎవ్వరూ చెప్పినది కాదు వేదం. మరి ఏమిటి వేదం ? "యస్య విశ్వసితం వేదాః" వేదాలు ఆయనకి ఊపిరి అని చెప్పారు. అయన నిర్ణయించింది కూడా కాదు. ఆయన అనుభవించ కలడు. అవి ఒక పుస్తకం కాదు అని గుర్తించాలి.

వేద శబ్దాన్ని తీసుకొని దీనికి ఇది ఇంత అర్థం అని చెప్పలేం. జన్మ నిచ్చే తల్లిని మనం అమ్మ అని పిలుస్తాం, మరొక భాషలో మా అని, తాయార్ అని ఇలా వివిద శబ్దాలతో పిలుస్తారు. అయితే ఆ వ్యక్తిని చెప్పడానికి ఇన్ని శబ్దాలు ఆ అమ్మని చెప్పటానికే ఏర్పడ్డవి, కానీ ఈ శబ్దాలకి అర్థం అమ్మ అవుతుందా? అమ్మని పూర్తిగా ఈ శబ్దం చెప్పగలదా ? శబ్దం అనేది అనిత్యం, ఇప్పుడు ఉంటుంది, కొంత సమయానికి ఉండదు. ఆయితే ఆ అమ్మ ఎప్పటికి అక్కడ నిలిచి ఉంది. అమ్మలో మార్పు లేదు. ఆ శబ్దంలో కనిపించని ప్రేమ,వాత్సల్యం అనే గుణాలు ఆ అమ్మలో కనిపిస్తున్నాయి. కనుక శబ్దం అనేది చాలా తక్కువ, దాని అర్థం చాల ఎక్కువ. అందుకే వేద శబ్దానికి ఇది అర్థం అని చెప్పడం కష్టం. అలా చెప్పడం సముద్రాన్ని చిన్న పాత్రలో నింపే ప్రయత్నం చేసినట్లే అవుతుంది.
అయితే ఈ వేదాలతోనే ఇంత సృష్టి జరిగింది కనక సృష్టికి ప్రతి సృష్టి చేయగలగొచ్చు అనడానికి విశ్వామిత్రుడే ఉదాహరణ. మన జన్మకి ప్రవృత్తికి కారణం వేదమే, కేవలం మనమే కాదు ఈ విశ్వం అంతటికీ కారణం వేదమే, తల్లిని ఎట్లా అయితే పూజిస్తామో, కృతజ్ఞత కల్గి ఉంటామో ఆ వేదానికీ మనం కృతజ్ఞత కల్గి ఉండాలి. ఆ వేదం పురాణాల ద్వారా, స్మృతుల ద్వారా ఇలా వివిద రకాలుగా అందవచ్చు కనక వాటిని గూర్చి తెలుసుకొనే ప్రయత్నం చేద్దాం, కానీ అది ఇంతే అని అర్థం కట్టలేం. మనం అదృష్టం మనం ఆ సంప్రదాయంలో ఉన్నాం. వాటిని మనం పరిరక్షించుకుందాం.


మొదట కలగలుపుగా ఉన్న వేదాలను వ్యాస మహర్షి ఒక క్రమం ప్రకారం విభజించాడనీ, కనుకనే ఆయన వేదవ్యాసుడు అయ్యాడనీ చెబుతారు. అలా నాలుగు వేదాలు మనకు లభించాయి.

  1. ఋగ్వేదము
  2. యజుర్వేదము
  3. సామవేదము
  4. అధర్వణవేదము

వ్యాసుడు అలా వేదాలను విభజించి తన శిష్యులైన పైలుడు, వైశంపాయనుడు, జైమిని, సుమంతుడు అనేవారికి బోధించాడు. వారు తమ శిష్యులకు బోధించారు. అలా గురుశిష్యపరంపరగా ఈ నాలుగు వేదాలు వేల సంవత్సరాలుగా తరతరాలకూ సంక్రమిస్తూ వచ్చాయి. వేదాలను ఉచ్ఛరించడంలో స్వరానికి చాలా ప్రాముఖ్యత ఇస్తారు.

అన్ని వేదాలూ కలిపి 1180 అధ్యాయాలు, లక్షపైగా శ్లోకాలు ఉండాలని అంటారు. కాని ప్రస్తుతం మనకు లభించేవి 20,023 మాత్రమే (ఈ సంఖ్య 20,379 అని కూడా అంటారు).

మళ్ళీ ఒక్కొక్క వేదంలోను నాలుగు ఉపవిభాగాలున్నాయి. అవి

  1. మంత్ర సంహిత
  2. బ్రాహ్మణము
  3. ఆరణ్యకము
  4. ఉపనిషత్తులు

ఈ విభాగాలలో మొదటి రెండింటిని "కర్మకాండ" అనీ, తరువాతి రెండింటిని "జ్ఞానకాండ" అనీ అంటారు.

ఋగ్వేదము

ప్రపంచంలో అత్యంత పురాతనమైన గ్రంధాలలో ఒకటిగా చెప్పబడే ఋగ్వేదంలో ఒక పేజీ.

ఇది అన్నింటికంటె పురాతనమైనది, ముఖ్యమైనది. బహుశా ప్రపంచంలోనే అత్యంత పురాతన సాహిత్యం కావచ్చును. ఇందులో 21 అధ్యాయాలు ఉన్నాయి. స్తుత్యర్థకమైన మంత్రానికి ఋక్కు అని పేరు. మిగిలిన వేదాలలోని చాలా విషయాలు ఋగ్వేదానికి అనుసరణగానో, పునరుక్తిగానో ఉంటాయని చెప్పవచ్చును. ఋగ్వేదంలో 1028 దేవతా స్తుతులున్నాయి. వీటిలో అతి పెద్దది 52 పనసలు గలది. ఈ స్తోత్రాలన్నింటినీ 10 మండలాలుగా విభజించారు. తత్వ, అలౌకిక విషయాలను వివరించడంవలన పదవ మండలం ప్రత్యేక ప్రాధాన్యత సంతరించుకొన్నది.

  • ఋగ్వేద బ్రాహ్మణాలు: ఐతరేయ, కౌశీతకీ, పైంగి, సాంఖ్యాయన
  • ఋగ్వేద ఆరణ్యకాలు: ఐతరేయ, కౌశీతకీ
  • ఋగ్వేద ఉపనిషత్తులు: ఐతరేయ, కౌశీతకీ

నాలుగు వేదాల లోను ఋగ్వేదము అత్యంత పురాతనమైన గ్రంథము. ఇది ప్రధానంగా యాగాలలో దేవతాహ్వానానికి ఉపయోగించేది. ఋగ్వేదం ఋక్కుల రూపంలో ఉంటుంది. వేదాలలో ఋగ్వేదం మొదటిది .ఋగ్వేదం దేవ వేదంగా చెప్పబడింది. యజుర్వేదం మానవులకు, సామవేదం పితరులకు అని మనుస్మృతి వివరిస్తుంది.శౌనక మహర్షి ఋగ్వేదంలో 10,580 ఋక్కులున్నట్లు వర్ణించాడు. ఋగ్వేదం పద్యరూపంలో ఉంటుంది. ఋక్కులలో ఐదు రుక్కులను ప్రధానంగా చెప్పబడ్డాయి.1 శాకల, 2 వాష్కల, 3 అశ్వలాయన, 4 మండూకాయన, 5 శాంఖ్యాయన. వీటిలో శాంఖ్యాయన, మండూకాయన, వాష్కల లభ్యం కాలేదు. ఋగ్వేదం రెండు విభాగాలుగా ఉన్నాయి. ఒకటి అష్టకాలు వాటిలో అధ్యాయాలు వాటిలో వర్గాలు ఉంటాయి. రెండవ విభాగం మండలాలుగా విభజింపబడింది. మండలాలలో అనువాకాలూ వాటిలో సూక్తులుగా విభజింపబడ్డాయి. మొత్తం 1017 సూక్తాలలో 10,580 ఋక్కులలో 1,53,826 శబ్ధాలు వాటిలో 4,32,000 అక్షరాలు ఉన్నట్లు మహర్షి శౌనకుని వర్ణన.ఈ అక్షరాలు కలియుగం లోని సంవత్సరాలు ఒకటేనని భావన.

ఋగ్వేదంలోని కొన్ని సూక్తాలు పురాణ గాధలుగా వర్ణించబడ్డాయి. ఋగ్వేదం అనేక స్త్రోత్రాలు ఉన్నాయి.ఋగ్వేదంలోని దశమ సూక్తంలోని పురుష సూక్తం విశేషంగా ప్రశంసింపబడింది. ఋగ్వేదంలో సామాజిక ప్రవర్తన గురించి చక్కగా వర్ణించింది. ఋగ్వేదం కామితార్ధాలను తీర్చే వేదం. వర్షాలు పడాలంటే పర్జస్య పఠించాలని సూచింప బడింది. జూదం ఆడకూడదని అనేక సూక్తాలు బోధించాయి. కొన్నిటిలో జూదమాడిన వ్యక్తి వర్ణన ఉంది. శంకరాచార్యులచే ఋగ్వేదం ప్రశంసించబడింది."అనోభద్రా క్రతవో యంతు విశ్వత॰"అనే సూక్త పఠనం మానవులను దీర్గాయుషులను చేస్తుందని విశ్వసిస్తున్నారు.

ఋగ్వేదం విజ్ఞానం

ఋగ్వేదంలోని ప్రధమ మండలంలోని అశ్వనిసూక్తంలో అశ్వనిదేవతలు చేసిన చికిత్సలు వర్ణించబడ్డాయి.ఖేలుడు అనే రాజు భార్య యుద్ధంలో రెండు కాళ్ళు కోల్పోగా అగస్త్యముని సలహాతో వారు అశ్వనీ దేవతలను స్తుతిచేయగా వారు ఆమెకు ఇనుపకాళ్ళను అమర్చినట్లు వర్ణించ బడింది.దధీచి మహర్షికి ఇంద్రునిచే ఉపదేసింపబడిన మంత్రాన్ని తెలుసుకోవడానికి అశ్వినీ దేవతలు ఆయనకు మొందుగా తల తీసి జంతువు తలను అతికించి అతని నుండి 'ప్రవర్ణ'అనే మంత్రాన్ని గ్రహించగానే ఇంద్రుడు దధీచి ముని తల నరకగానే అశ్వినీ దేవతలు వెంటనే దధీచి ముని తలను తిరిగి అతికించినట్లు వర్ణించబడింది.ఇలాంటి అతిసూక్ష్మాతి సూక్ష్మమైన శస్త్ర చికిత్సలు ఋగ్వేదంలో వర్ణించబడ్డాయి.


ఋగ్వేదంలో అగ్నిసూక్తంలో వ్ద్యుత్‌ను పోలిన వర్ణన ఉంది.శుదర్ణ లో శబ్ధ ప్రయోగం ద్వారా ద్వని తరంగాల ప్రసారం గురించి వర్ణించబడింది. ఋగ్వేదంలో శృధి శృతకర్ణ వహ్నిభి లో సంకేత పదరూపంలో నేటి టెలిఫోను అధారిత వర్ణన ఉంది. మేఘాలు రూపాన్ని సంతరించుకోవడం వర్షించడం లాంటి వృష్టి సంబంధిత జ్ఞానం ఋగ్వేదంలో ఉంది. క ఇమంలో గర్భయో ఆపాం ,గర్బోవనానాం గర్భశ్చస్తాతాం అనే మంత్రం జలంలో విద్యుత్ దాగి ఉన్నట్లు వర్ణిస్తుంది. మేఘాల నిర్మాణం దానికి పట్టే సమయం ఋగ్వేదంలో వర్ణించ బడింది. పర్యావరణ సంబంధిత విషయాలు ఋగ్వేదంలో ఉన్నాయి.గణితానికి సంబంధించి వ్రాతం వ్రాతం,గణం గణం,గణినం మొదలన శబ్ధాలతో వర్ణించబడింది. రేఖాగణిత విషయాలూ ప్రస్తావించబడ్డాయి.


యజుర్వేదము

యజుర్వేదం అంటే యాగాలు ఎలాచేయాలో చెప్పేది. యాగము, బలి, దానము మొదలైనవాటిని ఆచరించేటపుడు ఋత్విక్కులు[పురోహితులు] చెప్పే మంత్రాలు [పద్యాలు] యజుర్వేదంలో ఉన్నాయి.

యజ్ఞాలలో యజుర్వేదాన్ని అనిష్టించేవారికి "అధ్వర్యులు" అని పేరు. కృష్ణ యజుర్వేదం లో తైత్తరీయ సంహితయందలి 7 అష్టకాలలో [కాండాలు]44పన్నాలు [అధ్యాయాలు]ఉన్నాయి. 651 అనువాకములు, 2198 పనసలు (ప్రకరణములు) ఉన్నాయి. తైత్తరీయ బ్రాహ్మణం (పరాయితం)3అష్టకాలలో [కాండాలు]38పన్నాలు [అధ్యాయాలు]ఉన్నాయి. 378 అనువాకములు, 1841 పనసలు (ప్రకరణములు) ఉన్నాయి. తైత్తరీయ ఆరణ్యకం 2 విభగాలు ఆరణ్యకం 5, ఉపనిషత్ 5,పన్నాలు [అధ్యాయాలు]ఉన్నాయి. 290 అనువాకములు, 621 పనసలు (ప్రకరణములు) ఉన్నాయి. మొత్తం 82పన్నాలు [అధ్యాయాలు]ఉన్నాయి.1279 అనువాకములు, 4620 పనసలు (ప్రకరణములు) ఉన్నాయి. తైత్తరీయ కృష్ణ యజుర్వేదం లో సంహిత బ్రాహ్మణం కలగలసి (కలగాపులగంగా)ఉండటం వలన, అధ్యయినం, సమన్వయం, ప్రయోగం,కష్టతరం కావటం వలన యాజ్ఞవల్క్య మహర్షి శుక్ల యజుస్సులను దర్శించారు



యజ్ఞపరాలైన మంత్రాలకు యజస్సులు అని పేరు. యజుర్వేదంలో 109 శాఖలున్నాయి. అందున అన్నీ నసించగా మనకు మిగిలినవి 2 శాఖలు. ===మైత్రాయనియము (తైత్తిరీయము)=== ఇప్పుడు మైత్రయనియము కూడా కాలగర్భములో కలసి పోతోంది. మన తరువాత తరం వారికి మెగిలేది ఏమి ఉండదు. రక్షించవలసిన బాధ్యత మనది ఇది చాలావరకు గద్యరూపంలో ఉంటుంది. దీనికి క్రియావిధులు ఉంటాయి.

  • దీనిలో బ్రాహ్మణాలు: తైత్తిరీయ, భార్గవ, కాత్యాయన, మైత్రాయణ, కరు

శుక్ల యజుర్వేదము (వాజసనేయము)

ఇది 40 అధ్యాయాలు గల గ్రంథం. యజ్ఞాలకు సంబంధించిన విషయాలు ఇందులో ఉన్నాయి. ఈ వేదం ముఖ్యంగా మాధ్యందిన, కాణ్వ సంప్రదాయాలలో ఉన్నది.

  • దీనిలో బ్రాహ్మణాలు:శతపథ
  • దీనిలో ఆరణ్యకము, ఉపనిషత్తు: బృహదారణ్యక

సామవేదము

చతుర్వేదాలలో ఒకటి సామవేదము . సామం అనగా మధురమైనది. వేదం అనగా జ్ఞానం అని అర్థం. అంటే ఇది యాగాలలో దేవతల గొప్పతనాన్ని మధురంగా కీర్తించేది. నాలుగు వేదాల క్రమంలో మూడవది. దీనిని వేదవ్యాసుడు జైమిని మహర్షికి బోధించాడు. దీనిలో మొట్టమొదటి భాగాలు క్రీ.పూ 1000 వ శతాబ్దానికి చెందినవిగా భావిస్తున్నారు. ప్రాముఖ్యతలో, పవిత్రతలో, సాహిత్య విలువల్లో ఋగ్వేదం తర్వాత రెండవ స్థానంలో ఉంటుంది.


వేదాల మధ్య సంబంధం
వేదాలలో మూడు విధాలైన మంత్రాలున్నాయి - ఋక్కులు, యజుస్సులు, సామములు. ప్రత్యేమైన ఛందస్సులో ఉన్న పద్య శ్లోకం ఋక్. వచన రూపంలో (ఛందస్సు లేకుండా) ఉన్నను యజుస్సులు. గానానికి అనుగుణమైన పద్యశ్లోకం సామము. ఒకే శ్లోకం ఋక్కుగాను లేదా సాముగాను వివిధ సందర్భాలలో ప్రస్తావింపబడవచ్చును. ఋగ్వేదంలో అధ్యయన బద్ధమైన ఋక్కులున్నాయి. యజ్ఞాలలో ఉచ్ఛరింపబడే మంత్రాలు యజుర్వేదంలో ఉన్నాయి. ఇవి కొన్ని యజుర్మంత్రాలు మరియు కొన్న ఋగ్వేదమంత్రాలు. సామవేదంలో సామములున్నాయి. అధర్వణ వేదంలో ప్రధానంగా ఋక్కులు, కొన్ని యజుస్సులు


ఇందులో వెయ్యి అధ్యాయాలున్నాయి. నియమ పూర్వకంగా గానం చేసే మంత్రాలకు సామములు అని పేరు. దీనిలో 75 మంత్రాలు తప్ప మిగిలినవన్నీ ఋగ్వేదంలోని 8,9వ మండలాలనుండి తీసికోబడ్డాయి.

సామవిధాన, మంత్ర, ఆర్షేయ, వంశ, దైవతాధ్యాయ, తలవకార, తాండ్య, సంహిత ఉపనిషత్తులు, ఛాందోగ్య, కేనోపనిషత్తులు సామవేదంలోనివే. సామవేదానికి ఆరణ్యకాలు లేవు.




అధర్వణవేదము:


అధర్వణ వేదం హిందూ మతంలో పవిత్ర గ్రంథాలైన చతుర్వేదాలలో నాలుగవది. అధర్వణ ఋషి పేరు మీదుగా దీనికాపేరు వచ్చింది. సాంప్రదాయం ప్రకారం ఇది రెండు వర్గాల ఋషులచే సంకలనం చేయబడింది. ఒకటి అధర్వణులు, రెండు అంగీరసులు. అందుకనే దీని ప్రాచీన నామం అధర్వాంగీరస వేదం. ఋగ్వేదంలానే ఇది కూడా స్త్రోత్రాల చే కూర్చబడింది కానీ ఇందులో కొన్ని మంత్ర విద్య కు సంబంధించిన విషయాలు కూడా ఉన్నాయి. [1]

ఇందులో ఆత్మలు, ప్రేతాత్మలు, మొదలైన వాటిని గురించి వివరించబడి ఉంటాయి కాబట్టి అధర్వణ వేదాన్ని చాలామంది గుప్త విజ్ఞానంగా భావిస్తారు. ఇందులో వేదకాలంలో సామాన్య మానవులు ఎలా ఉండేవారన్న విషయాలు కూడా ఉటంకించబడ్డాయి.

వైద్యశాస్త్రాన్ని గురించిన మొట్టమొదటి ప్రస్తావన ఇందులోనే ఉంది . రోగాలకు కారణమయ్యే క్రిమి కీటకాదుల వంటి జీవుల గురించిన సమాచారం కూడా ఇందులో పొందుపరచబడి ఉంది. ఇందులో యుద్ధ విద్యల గురించి కూడా సమాచారం కలదు. ముఖ్యంగా బాణాలకు విషం పూయడం, విషపు వలలను తయారు చేయడం, శత్రు సైనికులను రోగపీడితుల్ని చేసే క్రిమి కీటకాదుల ప్రయోగం మొదలైన విషయాలు వివరించబడ్డాయి.

ఇందులో 50 అధ్యాయాలున్నాయి. ఈ వేదంలో ముఖ్యంగా ప్రాపంచిక అభ్యుదయానికి అవసరమైన మంత్రాలు, తంత్రాలు ఉన్నాయి. దీనికి ఏ ఆరణ్యకమూ లేదు. గోపథ బ్రాహ్మణము, ముండక, మాండూక్య, ప్రశ్నోపనిషత్తులు ఈ వేదానికి సంబంధించినవే.




తాజ్ మహల్ -తేజో మహల్ దేనిలో ఏది నిజం ?

తాజ్ మహల్,
ఒక మహా శివాలయాన్ని సమాధి గా చరిత్రకారులు అందించడం తప్పే, కాదనను. కానీ ఇక్కడ సమస్య తాజ్ మహల్ సమాధి అవునా కాదా అనేది కాదు అని నా అభిప్రాయం. నిర్ద్వంద్వంగా తాజ్ మహల్ షాజహాన్ కట్టించలేదు. దానికి చాలా రకాల అధారాలు ఉన్నాయి. అయితే తాజ్ మహల్ గొప్ప కట్టడమా కాదా? దానికి ప్రపంచ ఏడు వింతల్లో చోటు సాదించే అర్హత ఉందా లేదా అని మాత్రం మనం మట్లాడుకోవాలి. నేను అందరినీ పేరుపేరునా అడిగేది ఒకటే. మీకు తాజ్ మహల్ నచ్చితే వోటు వేయండి. దానికంటే అధ్భుతమైన కట్టడాలు కనిపిస్తే వాటికే వోటు వేయండి. దీనికి చరిత్ర రంగు పులమకండి. తాజ్ ని షాజహాన్ కట్టించలేదని నిరూపించే పనులు ఎప్పుడో మొదలై పూర్తయ్యాయని నా అభిప్రాయం.భారత దేశానికి ఉన్న ఒకే ఒక అమూల్యమైన, అపూర్వమైన, అద్వితీయమైన కట్టడాన్ని భావి తరాలకు తెలియచేయడానికి దాన్ని ఏడు వింతల్లో చేర్చడమే మార్గమని నా అభిప్రాయం.లేకుంటే ఎన్నో శిధిలాలయలలా, అదీ మరుగున పడి మసి బారి పోతుంది.


BBC వారు విడుదలచేసిన ఛాయాచిత్రాలు




BBC says about Taj Mahal—Hidden Truth – Never say it is a Tomb

Aerial view of the Taj Mahal

tejo mahal 1

The interior water well
tejo mahal

Frontal view of the Taj Mahal and dome

Tejo Mahal

Close up of the dome with pinnacle
Tejo Mahal


Close up of the pinnacle
Tejo Mahal


Inlaid pinnacle pattern in courtyard
Tejo Mahal


Red lotus at apex of the entrance
Tejo Mahal. … not taj mahal… its Lord Shiva temple in Agra, India

Rear view of the Taj & 22 apartments
Dec 19, 2006 4:45pm

View of sealed doors & windows in back
Tejo Mahal…not Taaj Mahal…. Its Lord Shiva Temple in agra, india

Typical Vedic style corridors
Tejo Mahal…not Taaj Mahal…. Its Lord Shiva Temple in agra, india

The Music House–a contradiction
Tejo Mahal…. not taj mahal… Its Lord Shiva temple in Agra, india

A locked room on upper floor
Tejo Mahal…not Taaj Mahal…. Its Lord Shiva Temple in agra, india

A marble apartment on ground floor
Tejo Mahal…not Taaj Mahal…. Its Lord Shiva Temple in agra, india

The OM in the flowers on the walls
Tejo Mahal…not Taaj Mahal…. Its Lord Shiva Temple in agra, india

Staircase that leads to the lower levels
Tejo Mahal…not Taaj Mahal…. Its Lord Shiva Temple in agra, india

300 foot long corridor inside apartments
Tejo Mahal…not Taaj Mahal…. Its Lord Shiva Temple in agra, india

One of the 22 rooms in the secret lower level
Tejo Mahal…not Taaj Mahal…. Its Lord Shiva Temple in agra, india

Interior of one of the 22 secret rooms
Tejo Mahal…not Taaj Mahal…. Its Lord Shiva Temple in agra, india

Interior of another of the locked rooms

Tejo Mahal…not Taaj Mahal…. Its Lord Shiva Temple in agra, india

Vedic design on ceiling of a locked room
Tejo Mahal…not Taaj Mahal…. Its Lord Shiva Temple in agra, india

Huge ventilator sealed shut with bricks
Tejo Mahal…not Taaj Mahal…. Its Lord Shiva Temple in agra, india

Secret walled door that leads to other rooms
Tejo Mahal…not Taaj Mahal…. Its Lord Shiva Temple in agra, india

Secret bricked door that hides more evidence
Tejo Mahal…not Taaj Mahal…. Its Lord Shiva Temple in agra, india

Palace in Barhanpur where Mumtaz died
Tejo Mahal…not Taaj Mahal…. Its Lord Shiva Temple in agra, india

Pavilion where Mumtaz is said to be buried
Tejo Mahal…not Taaj Mahal…. Its Lord Shiva Temple in agra, india

No one has ever challenged it except Prof. P. N. Oak, who believes the
whole world has been duped. In his book Taj Mahal: The True Story, Oak says
the
Taj Mahal is not Queen Mumtaz’s tomb but an ancient Hindu temple palace of
Lord Shiva (then known as Tejo Mahalaya ) . In the course of his research O
ak discovered that the Shiva temple palace was usurped by Shah Jahan from
then Maharaja of Jaipur, Jai Singh. In his own court ch ronicle,
Badshahnama,
Shah Jahan admits that an exceptionally beautiful grand mansion in Agra
was taken from Jai SIngh for Mumtaz’s burial . The ex-Maharaja of Jaipur
still
retains in his secret collection two orders from Shah Jahan for
surrendering the Taj building. Using captured temples and mansions, as a
burial place for
dead courtiers and royalty was a common practice among Muslim rulers.

For example, Humayun,Akbar, Etmud-ud-Daula and Safdarjung are all buried
in such mansions. Oak’s inquiries began with the name of Taj Mahal. He says

the term ” Mahal ” has never been used for a building in any Muslim countries
from Afghanisthan to Algeria . “The unusual explanation that the term Taj
Mahal derives from Mumtaz Mahal was illogical in atleast two respects.

Firstly, her name was never Mumtaz Mahal but Mumtaz-ul-Zamani,” he writes.
Secondly, one cannot omit the first three letters ‘Mum’ from a woman’s
name to derive the remainder as the name for the building.”Taj Mahal, he
claims, is a corrupt version of Tejo Mahalaya, or Lord Shiva’s Palace . Oak
also says the love story of Mumtaz and Shah Jahan is a fairy tale cre ated
by
court sycophants, blundering historians and sloppy archaeologists Not a
single royal chronicle of Shah Jahan’s time corroborates the love story.

Furthermore, Oak cites several documents suggesting the Taj Mahal predates
Shah Jahan’s era, and was a temple dedicated to Shiva, worshipped by
Rajputs of Agra city. For example, Prof. Marvin Miller of New York took a
few
samples from the riverside doorway of the Taj. Carbon dating tests revealed
that the door was 300 years older than Shah Jahan. European traveler Johan
Albert Mandelslo,who visited Agra in 1638 (only seven years after Mumtaz’s
death), describes the life of the cit y in his memoirs. But he makes no
reference to the Taj Mahal being built. The writings of Peter Mundy, an
English visitor to Agra within a year of Mumtaz’s death, also suggest the
Taj was a noteworthy building well before Shah Jahan’s time.

Prof. Oak points out a number of design and architectural inconsistencies
that support the belief of the Taj Mahal being a typical Hindu temple
rather
than a mausoleum. Many rooms in the Taj ! Mahal have remained sealed
since Shah Jahan’s time and are still inaccessible to the public . Oak
asserts they contain a headless statue of Lord Shiva and other objects
commonly used for worship rituals in Hindu temples Fearing political
backlash, Indira Gandhi’s government t ried to have Prof. Oak’s book
withdrawn from the bookstores, and threatened the Indian publisher of the
first edition dire consequences .

ఓంకార నాదం

ఓంకారం :


ఓమ్+ఆకారం =ఓంకారం
దాని పుట్టు పూర్వోత్తరాలు :
ఓంకారం అనునది ఒక బీజక్షరి మంత్రం

ఓంకారం మనలను అన్ని విధాలా రక్షించేది. అసలు అక్షరానికున్న అర్థమే అది. “అవతి రక్షతీతి ఓమ్అని రక్షించునది అనియే ఓంకారానికి అర్థం. కాబట్టి మనకు ఓంకారం సర్వదా సర్వధా రక్ష. ప్రణవ మనేదిణు స్తుతౌఅనే ధాతువు నుండి పుట్టింది. “ప్రకృష్టో నవః ప్రణవ:” అని పుష్కలమైన స్తోత్రముగా ప్రణవమునకు అర్థం చెప్పబడింది. “యద్వా ప్రణౌతి ప్రస్తూయతే అనయా బ్రహ్మేతి ప్రణవః”. స్తోత్రము సకల దేవతలకు చెందునది, లేదా సకల దేవాత్మకమగు బ్రహ్మమునకు చెందునది. “ప్రాణాన్ సర్వాన్ పరమాత్మని ప్రణానయతీ త్యేతస్మాత్ ప్రణవః” – సర్వ ప్రాణములను పరమాత్మయందు లగ్నము చేయునది అని కూడా ప్రణవమున కర్థం. “ప్రణౌతీతి ప్రణవః తస్మాత్ ఓమితి ప్రణౌతి ఇతిస్తుతేఃఅని విష్ణు సహస్రనామ శంకర భాష్యంలో కూడా స్తుతి పరమైనదిగా ఓంకారం తెలుపబడింది. “ప్రణవష్టేఃఅని పాణినిచే వ్యాకరణ సూత్రం వ్రాయబడింది. దానికి భాష్యం వ్రాస్తూ పతంజలి యజ్ఞకర్మల యందు ఋక్కుల యొక్క చివరలో పలుకబడు ఓంకారమే ప్రణవం అని చెప్పారు. యజ్ఞము, వేదాధ్యయనము, వేదమంత్రోచ్చారణములందన్నిటి ఆద్యంతములందు ఓంకారం ఉచ్ఛరించాలనేది వేద సంప్రదాయం. అందుకే తైత్తిరీయా రణ్యకంలోయో వేదా దౌ స్వరః ప్రోక్తో వేదాంతే ప్రతిష్ఠితఃఅని సూచింప బడింది.






హిందూమతం అనగానే స్వమతస్థులు, విమతస్థులు కూడా ముఖ్యంగా విమర్శించే విషయం, అర్థం చేసుకోలేకపోయే విషయం ఇందులో అనేక పంథాలుండటం, చాలామంది దేవతలుండటం గూర్చి. “ఏకం సత్ విప్రా బహుధావిదంతి” (1 – 164 – 46) అని, “ఏకం సన్తం బహుధా కల్పయన్తి” (10 – 114 – 5) అని ఋగ్వేదం చెప్తోంది. అంటే ఒకే సత్ పదార్థాన్ని పండితులు అనేక విధాల చెప్తున్నారని అర్థం. ఒకే ఒక్క సత్యపదార్థమే ఓంకారం. హిందూ ధర్మం మొత్తానికి అర్థం ఓంకారంలోనే ఉంది. మూల తత్వం పూర్తిగా అర్థం చేసుకుంటే తప్ప హిందూత్వంలోని ఏకాత్మత అర్థమయి సకల సందేహాలు తీరవు. హిందూ మతం మొత్తాన్ని ఒక్క వాక్యంలో చెప్పటం కాదు. ఒక్క పదంలో చెప్పటం కాదు. ఒక్క అక్షరంలో చెప్పవచ్చు. అదేఓం”.

ప్ర్రతి రోజు ఓమ్ కారం చెప్పడం వాళ్ళ మే మనస్సుకు ప్రశాంతత , ఏకాగ్రత చేకూరుతుంది
సైన్సు కూడా ఇదే చెపుతుంది.